మంత్రాలయం: నియోజవర్గ ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి హైదరాబాద్ లో ఎంపీ మిథున్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వేధింపులు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.