రాష్ట్రంలో పండే కర్నూలు ఉల్లిపాయలను ప్రజలు ఆదరించి, రైతులకు మద్ధతుగా నిలవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. సోమవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం ఉల్లిపాయ మార్కెట్ ను ఆమె సందర్శించి, వ్యాపారులతో మాట్లాడారు. కర్నూలు, నంద్యాలలో పండిన ఉల్లిపాయ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నదన్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో వ్యాపారులు ఆ ఉల్లిని సాధ్యమైనంత మంచి ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.