కోడూరు మండల వ్యవసాయ అధికారి ఎం. శ్రీధర్, రైతులు పంటకు అవసరమైన యూరియాను ఒకేసారి నిల్వ చేయవద్దని, యూరియా నిరంతరంగా అందుబాటులో ఉంటుందని సూచించారు. శనివారం కోడూరు పిఎసిఎస్ వద్ద యూరియా పంపిణీ జరిగింది. మార్కెట్లో లభించే నానో యూరియా లిక్విడ్, ఒక బస్తా యూరియాతో సమానంగా పనిచేస్తుందని, అదే ధరకు దొరుకుతుందని ఆయన తెలిపారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.