రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాలలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు దుష్ప్రచారం పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఐదు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాలు మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా జిల్లా ప్రజలు కుల మతాలకు అతీతంగా తమ పండగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.