నిర్మల్ పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కావడి సేవ,పంచామృతాలతో అభిషేకం, రథసేవ, నక్షత్ర హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గురు మాత రాజరాజేశ్వరి దేవి, అరకారి రాజవ్వ,వీరనారాయణ స్వామి,చెనిగారపు చిన్నయ్య గురుస్వామి,గురుమంచి చంద్రశేఖర్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.