నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నుంచి మద్దిలేటి స్వామి దేవస్థానానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలకు గురి చేస్తోందని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకుడు తెలిపారు. గురువారం స్థానిక సిపిఐ నేతలతో కలిసి ఆయన రహదారిని పరిశీలించారు.పలుమార్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని అభ్యర్థించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.