దేవనకొండ ఎస్సీ కాలనీలో డీజే రంగస్వామి ఇంటి వద్ద నుంచి కొత్తపేట క్రాస్ రోడ్డు వరకు సీసీ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని సోమవారం జనసేన ఆధ్వర్యంలో ఎంపీడీవోకి వినతిపత్రం ఇచ్చారు. జనసేన నాయకులు ఉచ్చిరప్ప, రామాంజనేయులు మాట్లాడుతూ వర్షాలు వచ్చిన ప్రతిసారీ సీసీ రోడ్లు, కాలువలు లేకపోవడంతో రహదారిలో గుంతలు ఏర్పడి వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, పిల్లలు కింద పడిన సందర్భాలు ఉన్నాయన్నారు.