ఆదిలాబాద్ పట్టణంలోని సాయి నాథ్ పెట్రోల్ పంపు సమీపంలో ప్రధాన రహదారి పక్కన రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసు కుంది. రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తుంటారు. అక్కడ పని చేసే వారు వంట చేసుకుంటుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై అక్కడున్న దుస్తులకు అంటుకుంది. ఈ ప్రమాదంలో దుస్తులతో పాటు వంట సామగ్రి దగ్ధమైంది. స్థానికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. లక్షన్నర నష్టం వాటిల్లి ఉంటుందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు.