రైతు డిక్లరేషన్ పేరుతో నట్టేట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ముంచిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు ఈ మేరకు ఆదివారం మంథని ఏరియాలోని పోతారం విలోచరం గ్రామంలో వరద ఉధృతికి మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులతో గెలిచిన ఈ ప్రాంత ఎమ్మెల్యే పత్తి పంట నష్టం పై వెంటనే సర్వే చేయించి రైతులకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.