మామిడికుదురు మండలం, పాశర్లపూడి బ్రిడ్జి పై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన అమలాపురం కు చెందిన ఓ వ్యక్తి ని వాహనదారులు రక్షించారు. అమలాపురం కు చెందిన అంబేడ్కర్ (51) తన మోటార్ సైకిల్ ను వెంట తెచ్చుకున్న బాలుడికి అప్పగించి అతను గోదావరిలోకి దూకబోయాడు అప్రమత్తమైన అటుగా వెళ్తున్న ప్రయాణికులు అతనిని నిలువరించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది.