జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దంపతులు వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి, స్వామివారికి సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం అయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి దయతో రాష్ట్రంలో సరిపడా వర్షాలు కురిసి, టలు సమృద్ధిగా పండాలని ఆకాక్షించారు. కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు.