కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు సొసైటీ వద్దకు భారీగా చేరుకున్నారు. ఒక ఎకరాకు ఒక బస్తాన్ని ఇవ్వడంతో రైతులు సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం పంపించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.