చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఊబిది వానరాసి రాధిక 19సం సుమారు నెల రోజుల క్రితం, బుడగ జంగాలకు చెందిన గ్రామస్థుడైన వానరాసి కుమార్ బెడబుడిగజంగం కుమార్ అనే అతనితో వివాహం జరిగింది. కానీ పెళ్ళి అయిన తరువాత వారం రోజుల నుండే భర్త కుమార్ మృతురాలును మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇట్టి విషయములో కుల పెద్దలు సర్దిచెప్పిన కూడా భర్తలో మార్పు ఎలాంటి మార్పు రాక పోగా వేధింపులు ఎక్కువ కావడoతో, తన భర్త కుమార్ వేధింపులు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం ఇంటిలో ఉరివేసుకొని చనిపోయిందని స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ రాత్రి తెలిపారు.