పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం మార్పు వార్తలపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఆయన కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ఇంకా రద్దు కాలేదని, భీమవరం అభివృద్ధి లక్ష్యంగా వ్యక్తిగతంగా స్పందిస్తున్నానని తెలిపారు. జిల్లా కేంద్రం మార్పు వార్తలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, కేంద్ర మంత్రులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం మారిస్తే ప్రజా ఉద్యమం తప్పదని అన్ని అన్నారు.