ములుగు జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. నేడు మంగళవారం రోజున ఉదయం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. అయినా కూడా తమని పట్టించుకునే నాధుడే కరువయ్యారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు చేతికంద వస్తున్న పంటకు సరైన సమయంలో యూరియా అందక పంట నాశనమవుతుందని గోడు వెళ్ళబుచ్చారు.