రామాయంపేట స్వచ్ఛ మున్సిపాలిటీకి ప్రజలంతా సహకరించాలి : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీడీపీఓ జోత్స్న స్వచ్ఛ మున్సిపాలిటీకి ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీడీపీఓ జోత్స్న సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం మధ్యాహ్నం ఆమె పర్యటించారు. ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రతను ఆమె పరిశీలించారు. ప్రజలు నాళాలు, రోడ్లపై చెత్త వేయవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలన్నారు.