చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాయిపేట వద్ద బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నిద్రలోనే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళుతున్న ఏసి స్లీపర్ బస్సు మాసాయిపేట సమీపంలో ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు బస్సులో ఉన్న ప్రయాణికులను వేరే బస్సులో తరలించే క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్టం బవేరియా జిల్లా బలరాంపూర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ పాల్ 35సం నిద్రలో మృతి చెందినట్లు గమనించిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.