కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలంలో మహిళ 108వాహనంలో ప్రసవించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని బెడుదూరు చెందిన లక్ష్మిదేవికి గురువారం ఉదయం ప్రసవ నొప్పులు రావడంతో తాడిపత్రికి వెళ్లడానికి 108 వాహనాన్ని ఆశ్రయించారు. దారి మధ్యలో ప్రసవ నొప్పులు ఎక్కువ అవడంతో 108 వాహనంలోనే EMT సుధీర్ జాగ్రత్తగా డెలివరీ చేయగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను తాడపత్రికి తరలించారు. 108 పైలట్ రాజా సహకారం అందించాడని సుధీర్ తెలిపారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.