అదుపుతప్పి ద్విచక్ర వాహనం క్రింద పడడంతో వ్యక్తికి రక్త గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని నారాయణపూర్ గేటు సమీపంలో దోమ వెళ్లే మార్గంలో అదుపుతప్పి స్కూటీ బోల్తా కొట్టింది వ్యక్తి క్రిందపడి రక్త గాయాలు కావడం జరిగింది స్థానికుల సమాచారంతో అంబులెన్స్ అక్కడికి చేరుకొని చికిత్స నిమిత్తం గాయపడిన వ్యక్తిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.