నేపాల్లో జరిగిన దాడుల సమయంలో చిక్కుకున్న కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు చెందిన 32 మంది తెలుగు వారిని మంత్రి నారా లోకేశ్ సురక్షితంగా రప్పించే చర్యలు చేపట్టారు. ఆదోని ఎస్కేడీ కాలనీకి చెందిన బసవరాజు, అనిత దంపతులు మంత్రి చొరవతో నిన్న సాయంత్రం భారత్కు చేరుకున్నారు. టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడు బాధితులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.