వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో మంగళవారం నుంచి వీధి కుక్కల పట్టివేతకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ఏ వార్డులోనైనా కుక్కల బెడద ఉంటే వీధి కుక్కలు ఉంటే వారు లొకేషన్ ఫోన్ నెంబర్ వికారాబాద్ మున్సిపల్ సిబ్బందికి తెలపాలని పేర్కొన్నారు. కుక్కల బెడద లేకుండా వికారాబాద్ మునిసిపల్ను చేసేందుకు మున్సిపల్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.