ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో మంగళవారం వినాయక చవితి పండుగలు పురస్కరించుకొని జనసేన నాయకులు ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయకుడికి పూజలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని జనసేన నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 500 విగ్రహాల వరకు జనసేన నాయకులు ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రసాయన రంగులను ఉపయోగించి తయారు చేసే వినాయక విగ్రహాలను ఉపయోగించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.