శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రాత్రి ఇరువర్గాలు ఘర్షణ పడి ఆసుపత్రిలో ఉన్న వైద్యులు నర్సులు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గురువారం వైద్యుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓపిని బహిష్కరించి వైద్యులకు సిబ్బందికి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.