గోల్కొండ డివిజన్ పరిధిలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినూద్దీన్ అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. అనంతరం ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యల పరిష్కరిస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దావకానను సందర్శించి వసతులపై ఆరా తీశారు. సీజనల్ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఎమ్మెల్యే తెలిపారు.