అన్నమయ్య జిల్లా రాజంపేట : కూటమి ప్రభుత్వ విధానాలతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సికిందర్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు పడుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 16న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. బుధవారం ఆటో డ్రైవర్లతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని, ఆటోలలో ప్రయాణికులు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ప్రతి ఆటో డ్రైవర్కు రూ.25 వేలు ఆర్థికసహాయం అందించడ