ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో గురుస్తున్న భారీ వర్షాలకు గంటవానిపల్లి రహదారిపై తీగలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసినదే. దీంతో గ్రామస్తులు వాగు దాటేందుకు తాత్కాలిక పనులు చేపట్టారు. వాగు పై స్తంభాల ఏర్పాటు చేసుకొని దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.