కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నుండి ఒంగోలు వైపు వెళుతున్న బైక్ రైడర్ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని అతన్ని స్థానిక హాస్పటల్ కు తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.