ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్ఐ మల్లికార్జున రావు సూచించారు. వినాయక మండపాల వద్ద అశ్లీల నృత్యాలు రెచ్చగొట్టే పాటలు ఎట్టి పరిస్థితులలో పెట్టకూడదని అన్నారు. ట్రాఫిక్కు కు ఇబ్బంది లేకుండా విగ్రహాల మండపాలన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాలు ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు కమిటీ బాధ్యత వహించాలని కోరారు. తమ నిబంధనలు ఉలంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.