యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జూలూరు రుద్రవెల్లి హై లెవెల్ బ్రిడ్జి 12 ఏళ్లుగా పెండింగ్లో ఉందని పాత కాంట్రాక్టర్కు టెండర్ రద్దు చేసి కొత్త ఏజెన్సీ ద్వారా నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలన్నారు. భువనగిరి చిట్యాల రోడ్డు ప్రస్తుతం నేషనల్ హైవేలో పరిధిలో ఉందని,ఈ రహదారిని ఆర్ అండ్ బి రోడ్డుకు బదిలీ చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.