ప్రతి రోజూ మా ఇళ్లలో తాగడానికి చుక్క నీరు దొరకడం లేదు.బిందెలతో నీళ్లు మోసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఒక బింద 5 రూపాయలకి కొనుక్కుంటున్నాం.ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నముక్కపల్లి గ్రామంలోని కుమ్మర మిట్టలో తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని, గ్రామానికి శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే వారు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.