Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
కొండాపురం మండలంలో ఈ నెల 9వ తేదీన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.అయితే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ కార్యాలయంపై దాడి చేశారు. జనసేనపార్టీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను, పవన్ కళ్యాణ్ ఫోటోలను చించి వేశారు. ఈ ఘటన తెలుసుకున్న స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ ఆకుల వెంకట్ జరిగిన ఘటన నపై ఎస్సైని కలిసి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసినట్లు జనసేన నాయకులు తెలిపారు