పద్మావతి పార్కులో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ బాగు చేసి జిమ్ పరికరాలను మరమ్మతులు చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు గురువారం పద్మావతి పక్కనే ఉన్న మస్టర్ గదిని కార్పొరేటర్ శాలినితో కలిసి కమిషనర్ పరిశీలించారు ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు పార్కు పక్కన ఫుట్పాత్ పైన ఉన్న షాపులను తొలగించాలని మాస్టర్ గది పక్కన ఉన్న మరుగుదొడ్లలో కుళాయిలు బాగు చేయించాలని వాకింగ్ ట్రాక్ బాగు చేయించాలని టిడిపి నాయకులు శ్రీధర్ వర్మ వాకర్స్ కమిషనర్ కు విన్నవించారు.