వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లొద్దంటూ రైతులకు కూడా నోటీసులు ఇవ్వడం దారుణమని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు రోజు రాత్రి నుంచే వైసీపీ ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారని.. అర్ధరాత్రి సమయంలో నోటీసులు జారీ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి అతివృష్టి లేదంటే అనావృష్టి వస్తుందని బుధవారం ఉదయం 11 గంటలకి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు