*రాజ్యసభ సభ్యులు"సానా"చొరవ తో మ్రోగిన సైరన్* *కాకినాడ* : కాకినాడ నగరంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన వాటర్ వర్క్స్ ఆవరణలో ప్రతిరోజు మూడుసార్లు మ్రోగే సైరన్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చొరవతో మళ్లీ ప్రారంభమైంది. నగర ప్రజలు ఈ సమస్యను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ కి సూచనలు చేశారు. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సైరన్ మ్రోగడం ప్రారంభమైంది.