తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉపాధి భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలో సముద్రపు నాచు సాగుపై పైలెట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు కాకినాడ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఈ సాగు పద్ధతిని మహిళల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.