తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సీఐ గా శివ గంగాధర్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. టౌన్ సీఐగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ మెడికల్ లీవ్ లో వెళ్లారు. దీంతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న శివ గంగాధర్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు ఇంచార్జ్ సీఐ గా నియమించారు. శాంతి భద్రతలను కాపాడడానికి చర్యలు తీసుకుంటానని ఇంచార్జ్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన శివ గంగాధర్ రెడ్డి చెప్పారు.