జిల్లాలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 400 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ అలం తెలిపారు. స్థానిక టీటీడీసీ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 పోలింగ్ లోకేషన్లు 39 పోలింగ్ స్టేషన్ లో ప్రత్యేకంగా 8 రూట్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు