పంచరామ ప్రధమ క్షేత్రం అమరావతి అమరేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసివేసినట్లుగా అధికారులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొనడం జరిగింది. భక్తుల దర్శనాలు నిలిపివేసినట్లుగా దేవస్థానం కమిషనర్ ఏవో రేఖ తెలియజేశారు. సోమవారం ఉదయం వేద పండిత ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తారని పేర్కొన్నారు. గ్రహణం అనంతరం ఆలయంలో ప్రత్యేక శుద్ధి పూజలు జరగనున్నాయి.