సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎస్ఐ మధుకర్ అన్నారు. ఆదివారం కెరమెరి మండలం ఝరిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. SI మాట్లాడుతూ సైబర్ నేరాలు బాగా పెరిగాయని,ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాట్సప్లో వచ్చే లింక్లు ఓపెన్ చేయొద్దని అన్నారు. అనంతరం గ్రామంలోని యువకులకు వాలీబాల్ కిట్ లను పంపిణీ చేశారు.