కలికిరి లో ఇంటి జాగా ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్ లో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన ముద్దాయికి జడ్జి జైలు శిక్ష విధించినట్లు సీఐ ఎస్.అనిల్ కుమార్ సోమవారం సాయంత్రం తెలిపారు.కలికిరి మండలం కలికిరి పట్టణంలోని వెంకటేశ్వరపురం చెందిన గడ్డం శ్రీనివాసులు ఇంటి జాగా ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్ లో ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసి చీటింగ్ కు పాల్పడ్డాడు.ఇందిరమ్మ కాలనీకి చెందిన ముల్లంగి రమేష్ ఫిర్యాదుతో 2017లో అప్పటి ఎస్ఐ పురుషోత్తం రెడ్డి దర్యాప్తు చేసి వాయల్పాడు కోర్టులో కేసు ఫైల్ చేశారు. వాదోపవాదాలు విన్న జూనియర్ సివిల్ జడ్జి కె.గురు అరవింద్ ముద్దాయికి 7ఏళ్ళు జైలు శిక్ష, 20వేల జరిమానా విధించారు