అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఉప్పరసపాడు వెళ్లే ప్రధాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భారీగా గుంతలు ఏర్పడడంతో అటువైపు రాకపోకలు సాధించే వాహన సాధకులు తీవ్రవాస్తులు పడుతున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అటువైపుగా రాకపోకలు సాగించే ఆటో డ్రైవర్లు ఆ గోతులను పూడ్చివేసి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించారు. ఇదే సమస్యపై సంబంధిత శాఖల అధికారులకు వెల్లడించిన సమస్య పరిష్కరించలేదని వారు తెలిపారు.