ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం పొలాల అమావాస్య పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. రైతులు తమ ఎడ్లకు స్నానాలు చేసి. వివిధ వస్తువులతో అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్ళి స్థానిక ఆలయంలో పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఇంట్లో రైతులు పూజలు నిర్వహించి. ఎడ్లకు ప్రత్యేకంగా తయారు చేసి నైవేద్యాలను పెడుతారు. రైతులు ప్రతి ఏటా అనవాయితీగా పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు.