కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్లంతా వరదరాజుల రెడ్డి వల్ల ఇబ్బందులు పడ్డారని మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారు మునిరెడ్డి ఆరోపించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి మున్సిపల్ ఛైర్మన్ చెన్నా వెంకటసుబ్బన్న నుంచి మొదలుకొని ప్రస్తుత ఛైర్ పర్సన్ బీమునిపల్లె లక్ష్మీదేవి వరకు అందరూ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి ఇబ్బందులు పడ్డారన్నారు.