ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి ఉరకలు పెడుతుందని జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి తెలిపారు.కడప జిల్లా జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ.. డబల్ హిట్ అయ్యిందన్నారు.గత ప్రభుత్వ పాలన ఎలావుంది కూటమి ప్రభుత్వ పాలన తేడా చూడాలన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అందజేస్తూ కూటమి పాలన అద్భుతంగా సాగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏ పార్టీలో ఉన్న ఆయన చేసే అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.