ఏపీ లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి OSD ధనుంజయ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణమోహన్ రెడ్డిలకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం హైకోర్టు బయలు మంజూరు చేసింది. రాత్రి కావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. వైసిపి నేతలు వైసిపి లీగల్సేల్ న్యాయవాదులు పెద్ద ఎత్తున ప్రాంతానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆ వస్తున్న ఇరువురును విడుదల చేయకపోవడంతో న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.