ఉమ్మడి కడప జిల్లాలో యూరియా కొరత లేదని డి సి ఎం ఎస్ చైర్మన్ ఎర్రగుంట్ల జయప్రకాష్ తెలిపారు. ఆదివారం రైల్వే కోడూర్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికీ 60 శాతం మంది రైతులు యూరియా పంపిణీ చేశామన్నారు. యూరియా కోసం ప్రత్యేకమైన స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ పటాన్ మూల పాల్గొన్నారు