కాగజ్ నగర్ పట్టణానికి మహారాష్ట్ర నుండి అక్రమ మద్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కాగజ్ నగర్ బస్ స్టాండ్ లో తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో ప్లాస్టిక్ సంచలలో ప్యాక్ చేసి ఉంచిన ఒక వెయ్యి 50 సీసాల 90 ఎంఎల్ దేశిదారు మద్యం దొరకడంతో వాటిని స్వాధీన పరుచుకున్నట్లు టాస్క్ఫోర్స్ సిఐ రానా ప్రతాప్ తెలిపారు. దొరికిన దేశదారు విలువ సుమారు 63000 ఉంటుందని వాటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కాగజ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు,