ఎయిడ్స్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని రీడ్స్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ మహేష్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ నాగు జ్యోతి అన్నారు. కళ్యాణదుర్గంలోని కస్తూర్బా పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎయిడ్స్ ఎలా వస్తుంది? రాకుండా ఎలా అరికట్టాలి? అనే విషయాలను వివరించారు. అనంతరం డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను కూడా వివరించారు. విద్యార్థులు ఎయిడ్స్, డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.