అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని పెన్నహోబిలం వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.