రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రాత్రి సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులతో కలసి యథేచ్ఛగా కార్య కలాపాలు కొనసాగించడం వివాదానికి తెరతీసింది. మీడియా రాకతో సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు కంప్యూటర్లను బంద్ చేసి, పరుగులు తీయడం అనుమానాలకు తవిస్తోంది. 24గంటలు పనిచేసే వెసులుబాటు ఉందని సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ బుకాయించారు.